Share News

సందడిగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:18 AM

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం గీతం విశ్వవిద్యాలయంలో ప్రముఖుల సమక్షంలో సందడిగా సాగింది.

సందడిగా ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ

- సీఎం, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం గీతం విశ్వవిద్యాలయంలో ప్రముఖుల సమక్షంలో సందడిగా సాగింది. ఇంగ్లీష్‌ ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలుగు ప్రతిని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దగ్గుబాటి సతీమణి, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌, విశాఖ ఎంపీ, గీతం చైర్మన్‌ ఎం.శ్రీభరత్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:18 AM