Share News

మోగనున్న నగరా

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:53 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగనుంది. రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈనెల పదోతేదీ వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఈనెల 27వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 123 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 21,555 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మోగనున్న నగరా

ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

11న పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్‌

కలెక్టరేట్‌లో హెల్ప్‌ డెస్కు ఏర్పాటు

విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగనుంది. రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌. హరేంధిరప్రసాద్‌ సోమవారం నోటిఫికేషన్‌ విడుదలచేస్తారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈనెల పదోతేదీ వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఈనెల 27వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 123 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 21,555 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

రాష్ట్రంలో ఓటరుగా ఉంటేనే ...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థి జనరల్‌ అయితే రూ.10 వేలు/ ఎస్సీ,ఎస్సీలైతే రూ.ఐదువేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిచేసిన నామినేషన్‌ ఫారం, ఆస్తులు, అప్పులు, కుటుంబానికి చెందిన సమాచారంతో ఆఫిడవిట్‌, ఓటరుగా ఉన్న వివరాలను సంబంధిత అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి సంతకంతో కూడిన సర్టిఫికెట్‌ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. నామినేషన్‌పై ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్న పదిమంది ఓటర్లు బలపరుస్తూ సంతకాలు చేయాలి. నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి వద్దకు అనుమతిస్తారు. నామినేషన్ల దాఖలు సమయంలో సందేహాలు నివృత్తి, ఇతరత్రా సహాయం కోసం కలెక్టరేట్‌ మొదటి అంతస్తుపైకి వెళ్లేటప్పుడు మెట్లకు ఎదురుగా ఉన్న చాంబర్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సత్యపద్మ, ఇతర అధికారులు అందుబాటులో ఉంటారు.

ఓటు కోసం మరో 1,300 దరఖాస్తులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో 1,300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతనెల 31వ తేదీ చివర రోజు కావడంతో అప్పటివరకు వచ్చిన ఈ దరఖాస్తులను విచారించేందుకు వీలుగా సంబంధిత జిల్లాలకు పంపారు. కాగా ఈనెల పదో తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తారు. ప్రస్తుతం జాబితాలో ఉన్న 21,555 మంది ఓటర్లకు వీరు అదనం.

Updated Date - Feb 03 , 2025 | 12:53 AM