Share News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 22,493 మంది

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:13 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 22,493 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 13,508, మహిళలు 8,985 మంది ఉన్నారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 5,529 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 568 మంది ఉన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  ఓటర్లు 22,493 మంది

123 పోలింగ్‌ కేంద్రాలు

నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరిరోజు

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 22,493 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో పురుషులు 13,508, మహిళలు 8,985 మంది ఉన్నారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 5,529 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 568 మంది ఉన్నారు. కాగా ఈనెల 27వ తేదీన జరగనున్న ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యింది. పది మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకూ గడువు ఉంది. పోలింగ్‌ కోసం 123 కేంద్రాలు ఎంపిక చేశారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.

జిల్లాల వారీ పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల వివరాలు...

జిల్లా పోలింగ్‌ పురుషులు మహిళలు మొత్తం

కేంద్రాలు

శ్రీకాకుళం జిల్లా 31 3,416 1,619 5,035

పార్వతీపురం మన్యం 15 1,574 759 2,333

విజయనగరం జిల్లా 29 3,270 1,953 5,223

అల్లూరి

సీతారామరాజు 11 920 568 1,488

విశాఖపట్నం 13 2,539 2,999 5,529

అనకాపల్లి జిల్లా 24 1,789 1,096 2,885

మొత్తం 123 13,508 8,985 22,493

Updated Date - Feb 13 , 2025 | 01:13 AM