తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:05 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండంతో చలి తీవ్రత తగ్గడం లేదు.

దట్టంగా పొగమంచు
డుంబ్రిగుడలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండంతో చలి తీవ్రత తగ్గడం లేదు. శనివారం డుంబ్రిగుడలో 7.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. అరకులోయలో 7.6, జి.మాడుగులలో 8.6, హుకుంపేటలో 9.1, ముంచంగిపుట్టులో 9.2, పెదబయలులో 9.7, చింతపల్లిలో 10.2, పాడేరులో 10.5, అనంతగిరిలో 10.8, జీకేవీధిలో 11.7, కొయ్యూరులో 12.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గడం లేదు. రోజు ఉదయం పదిన్నర గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేస్తుండగా, మధ్యాహ్నం వేళలో ఒక మోస్తరుగా ఎండ కాస్తుంది. పగలు, రాత్రుళ్లు సైతం చలి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో గిరిజనులు ఉన్ని దుస్తులు ధరిస్తూ, మంటలు కాగుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.