Share News

విద్యార్థి దశలో పోలీస్‌ వ్యవస్థపై అవగాహన అవసరం

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:17 AM

విద్యార్థి దశలోనే బాలికలు పోలీస్‌ వ్యవస్థపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గిరిజన బాలికలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విద్యార్థి దశలో పోలీస్‌ వ్యవస్థపై అవగాహన అవసరం
విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌

పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశలోనే బాలికలు పోలీస్‌ వ్యవస్థపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గిరిజన బాలికలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా గిరిజన బాలికలకు పోలీస్‌ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ విభాగాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పోలీస్‌ వ్యవస్థలో వివిధ స్థాయిల్లో ఉండే అధికారులు, సిబ్బంది విధులు, వివిధ చట్టాలు, వాటి అమలు, ప్రజల రక్షణ, శాంతిభద్రతలు, తదితర అంశాలను విద్యార్థినులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పీ కె.ధీరజ్‌, సీఐలు బి.అప్పలనాయుడు, సంజీవరావు, జీడీ.ప్రసాద్‌, ముక్తేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:17 AM