Share News

టోరెంట్‌ ఫార్మాలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:14 AM

స్థానిక ఫార్మాసిటీలోని టోరెంట్‌ ఫార్మా పరిశ్రమలో ఆదివారం ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

టోరెంట్‌ ఫార్మాలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత

పరవాడ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఫార్మాసిటీలోని టోరెంట్‌ ఫార్మా పరిశ్రమలో ఆదివారం ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

టోరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రాడక్షన్‌ బ్లాక్‌లో సాల్వెంట్‌ ప్రాసెస్‌ పూర్తయిన అనంతరం దానిని డ్రయ్యర్‌లో నింపుతారు. ఆ సాల్వెంట్‌ పౌడర్‌గా తయారవుతుంది. మత్తుకు సంబంధించిన ట్యాబ్‌లెట్‌ పౌడర్‌ కావడంతో దాన్ని మిక్సింగ్‌ చేసే క్రమంలో కార్మికులు పి. రామకృష్ణ, జె.బసవేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పరిశ్రమ ఉద్యోగి ఒకరు వారికి అక్కడే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అందిన సమాచారం మేరకు సీఐ మల్లికార్జునరావు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తగిన భద్రత లేకపోవడం వల్లే ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 17 , 2025 | 12:14 AM