Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - Feb 20 , 2025 | 01:23 AM

ఎలమంచిలి మండలంలో బుధవారం సాయంత్రం రెండుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పాతజాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొనడంతో ఒక యువకుడు చనిపోయాడు. లైనుకొత్తూరు గ్రామం రామకృష్టాపురం కాలనీ వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటనలకు సంబంధించి పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్ర అందించిన వివరాలిలా వున్నాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజాన మోహన్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు

ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొని యువకుడి దుర్మరణం

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

ఎలమంచిలి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మండలంలో బుధవారం సాయంత్రం రెండుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పాతజాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొనడంతో ఒక యువకుడు చనిపోయాడు. లైనుకొత్తూరు గ్రామం రామకృష్టాపురం కాలనీ వద్ద లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటనలకు సంబంధించి పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్ర అందించిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన రాజాన మోహన్‌ (24) హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. పెదనాన్న కుమారుడి వివాహానికి హాజరు కావడానికి ఇటీవల గ్రామానికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై పాత జాతీయ రహదారి మీదుగా ఎలమంచిలి బయలుదేరాడు. పోలిమేరమ్మ గుడి సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా బైక్‌పై వస్తున్న ఎలమంచిలి కాకివాని వీధికి చెందిన వియ్యపు సత్యనారాయణను ఢీకొన్నాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌ పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఎలమంచిలి పట్టణంలోని రామ్‌నగర్‌కు చెందిన దొడ్డి సన్యాసిరావు (82) ద్విచక్ర వాహనంపై లైనుకొత్తూరులోని రైతు సేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పనిపూర్తయిన తరువాత ఇంటికి రావడానికి పాత జాతీయ రహదారిపైకి వచ్చే క్రమంలో ఎలమంచిలి నుంచి తుని వైపు వెళుతున్న లారీ ఢీకొన్నదీ. దీంతో సన్యాసిరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

Updated Date - Feb 20 , 2025 | 01:23 AM