Share News

రేపే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:56 AM

సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’కు అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియం వేదిక కానున్నది.

రేపే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

అనకాపల్లి ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహణ

అనకాపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు...గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌...ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌)’కు అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ స్టేడియం వేదిక కానున్నది. ఈ నెల ఐదో తేదీ... ఆదివారం ఉదయం పది గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.4 వేలు, రూ.3 వేలు బహుమతిగా అందించనున్నారు. ముగ్గు, రంగులు వగైరా సామగ్రి పోటీదారులే తెచ్చుకోవాలి. ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ (ఫోన్‌ నంబర్‌: 99854 11045) చేయించుకోవాలి. అనకాపల్లిలో నిర్వహించే పోటీలకు ‘కొణతాల సుబ్రహ్మణ్యం, అప్పలనరసమ్మ ట్రస్టు’ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది.

Updated Date - Jan 04 , 2025 | 12:56 AM