టమాటా రైతు దిగాలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:42 AM
సరైన ధర పలకకపోవడంతో టమాటా, చిక్కుడు రైతులు దిగాలు చెందారు. స్థానిక వన దేవీశ్వర ఆలయం సమీపంలో రైతులు శనివారం టమాటా, చిక్కుడు అధిక మొత్తంలో తీసుకువచ్చారు. అయితే కొనుగోలు చేసే వ్యాపారులు తక్కువ మంది రావడం, ధర కూడా తక్కువ పలకడంతో రైతులు నిరాశ చెందారు. టన్నుల కొద్దీ టమాటా రావడం, వ్యాపారులు కేవలం ఐదుగురే రావడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు రైతులు నిరీక్షించారు.
- ధర పలకకపోవడంతో డీలా
- 25 కిలోలు రూ.100 నుంచి రూ.150 మధ్య ధర
- కొందరు రైతులు తక్కువ ధరకు విక్రయించలేక తిరిగి తీసుకువెళ్లిపోయిన వైనం
- ఆటో చార్జీలు కూడా రావడం లేదని ఆవేదన
దేవరాపల్లి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): సరైన ధర పలకకపోవడంతో టమాటా, చిక్కుడు రైతులు దిగాలు చెందారు. స్థానిక వన దేవీశ్వర ఆలయం సమీపంలో రైతులు శనివారం టమాటా, చిక్కుడు అధిక మొత్తంలో తీసుకువచ్చారు. అయితే కొనుగోలు చేసే వ్యాపారులు తక్కువ మంది రావడం, ధర కూడా తక్కువ పలకడంతో రైతులు నిరాశ చెందారు. టన్నుల కొద్దీ టమాటా రావడం, వ్యాపారులు కేవలం ఐదుగురే రావడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు రైతులు నిరీక్షించారు. టమాటా క్రేటు (25 కిలోలు) రూ.100 నుంచి రూ.150 మధ్య ధర పలికింది. కొందరు ఈ ధరకే విక్రయించారు. మరికొందరు ఆదివారం విక్రయించవచ్చనే ఉద్దేశంతో సరకుతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. చిక్కుడు కాయలు కూడా క్రేటు (10 కిలోలు) రూ.100 నుంచి రూ.150 ధర పలికింది. రెండు రోజుల క్రితం టమాటా క్రేటు రూ.300 నుంచి రూ.400 పలకగా, శనివారం తక్కువ ధర పలకడంతో రైతులు ఆవేదన చెందారు. ఆటోలో క్రేటు తేవడానికి రూ.10లు, ఒక్కో క్రేటుకు ఆశీలు రూ.5లు చెల్లించాల్సి వస్తోందని, దీని వల్ల తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.