Share News

నేడు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా జేసీ అభిషేక్‌ గౌడ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Feb 02 , 2025 | 11:36 PM

స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ సోమవారం ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా జేసీ అభిషేక్‌ గౌడ బాధ్యతల స్వీకరణ
జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ

పాడేరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ సోమవారం ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవోగా బాధ్యతలు నిర్వర్తించిన వి.అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్టు అడ్మిస్ట్రేటర్‌గా ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన స్థానంలో ఇంకా ఎవర్ని నియమించకపోవడంతో స్థానిక జాయింట్‌ కలెక్టర్‌.. ఇన్‌చార్జి పీవోగా వ్యవహరిస్తారు. కాగా పోలవరం ప్రాజెక్టు అడ్మిసే్ట్రటర్‌గా వి.అభిషేక్‌ మంగళవారం బాధ్యతలు చేపడతారు. ఈ నెల 7న ఆయనకు పాడేరులో అధికారులు, సిబ్బంది వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 11:36 PM