Share News

నేడు పాఠశాలలకు సెలవు

ABN , Publish Date - Feb 27 , 2025 | 01:16 AM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్‌ జరుగుతున్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించామని డిప్యూటీ డీఈవో ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధించే టీచర్లకు మాత్రమే ఓటు హక్కు ఉన్నప్పటికీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల నిర్వాహకులు గమనించాలని సూచించారు.

నేడు పాఠశాలలకు సెలవు

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్‌ జరుగుతున్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించామని డిప్యూటీ డీఈవో ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధించే టీచర్లకు మాత్రమే ఓటు హక్కు ఉన్నప్పటికీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల నిర్వాహకులు గమనించాలని సూచించారు.

Updated Date - Feb 27 , 2025 | 01:16 AM