Share News

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:10 PM

జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లేదని, కోడి మాంసం, గుడ్లుపై ఎటువంటి అపోహలు పడవద్దని ప్రజలకు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ సీహెచ్‌ నర్సింహులు సూచించారు.

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు
మాట్లాడుతున్న జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ నర్సింహులు

కోడి మాంసం, గుడ్లుపై అపోహలు వద్దు

జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ నర్సింహులు

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లేదని, కోడి మాంసం, గుడ్లుపై ఎటువంటి అపోహలు పడవద్దని ప్రజలకు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ సీహెచ్‌ నర్సింహులు సూచించారు. పశుసంవర్థక శాఖ కార్యాలయంలో జిల్లాలోని పశువైద్యాధికారులకు గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడిగుడ్లు, మాంసం విషయంలో బర్డ్‌ఫ్లూపై ప్రజల్లో అనుమానాలను పశు వైద్యులు నివృత్తి చేయాలన్నారు. జిల్లాలో కోళ్లలో ఎటువంటి అసాధారణ మరణాలు నమోదు కాలేదని నిర్ధారించామన్నారు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా జిల్లాలోని కోళ్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణా విషయంలో స్థానిక చెక్‌ పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. కోడిగుడ్లు, మాంసం బాగా ఉడికించి వినియోగించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు.

Updated Date - Feb 13 , 2025 | 11:10 PM