Share News

తప్పని డోలీ మోత

ABN , Publish Date - Feb 21 , 2025 | 10:42 PM

మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ శివారు బందులుపనుకు గ్రామానికి చెందిన గర్భిణిని శుక్రవారం ఏడు కిలోమీటర్లు డోలీపై సీతబంధలు గ్రామానికి తరలించారు.

తప్పని డోలీ మోత
గర్భిణి పాంగి జ్యోతిని డోలీపై తరలిస్తున్న కుటుంబీకులు

ఏడు కిలోమీటర్లు డోలీపై గర్భిణిని సీతబంధలు తరలింపు

బందులుపనుకుకు రహదారి లేక పాట్లు

జి.మాడుగుల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ శివారు బందులుపనుకు గ్రామానికి చెందిన గర్భిణిని శుక్రవారం ఏడు కిలోమీటర్లు డోలీపై సీతబంధలు గ్రామానికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జి.మాడుగుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని గడుతూరు శివారు బందులుపనుకు గ్రామానికి చెందిన పాంగి జ్యోతి (19) నిండు గర్భిణి. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను డోలీపై ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న సీతబంధలు గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో జి.మాడుగుల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ గర్భిణి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా గర్భిణి జ్యోతి భర్త చిన్నారావు మాట్లాడుతూ డోలిపై ఏడు కిలోమీటర్లు తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. తరతరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, గ్రామానికి ఇంతవరకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి బందులుపనుకు గ్రామానికి రోడ్డు వేయాలని కోరారు.

Updated Date - Feb 21 , 2025 | 10:42 PM