Share News

ఏలేరు కాలువలోకి దూసుకెళ్లిన వ్యాన్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:17 AM

లేరు కాలువలో బొలేరో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. అనకాపల్లి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఏలేరు కాలువలోకి దూసుకెళ్లిన వ్యాన్‌
లువలో నుంచి బయటకు తీసిన వ్యాన్‌

ఇటుక బట్టీల వ్యాపారి మృతి

కొత్తూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఏలేరు కాలువలో బొలేరో వాహనం బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. అనకాపల్లి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొజ్జన్నకొండ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన తామర్ల నాగరాజు (52) ఇటుక బట్టీలు నిర్వహిస్తుంటాడు. ఇతనికి సొంతంగా బొలేరో వాహనం వుంది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో శంకరం గ్రామం నుంచి ఏలేరు కాలువ గట్టు రోడ్డు మీదుగా తుమ్మపాల వస్తున్నాడు. బొజ్జన్న కొండ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఇక్కడ పది అడుగుల లోతున నీరు వుండడంతో వాహనం పూర్తిగా మునిపోయింది. వాహనంలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయాడు. ప్రమాదం విషయాన్ని గమనించిన స్థానికులు వ్యాన్‌ నుంచి నాగరాజును బయటకు తీశారు. కానీ అప్పటికే మృతిచెందాడు. అనంతరం క్రేన్‌ సహాయంతో బొలేరో వ్యాన్‌ను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య ముత్యాలమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Jan 30 , 2025 | 01:17 AM