బాట బాగుంది
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:50 PM
ఎట్టకేలకు జిల్లా పాడేరు మెయిన్‌రోడ్డు అందంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై కనీసం దృష్టి సారించని సంగతి తెలిసిందే.

అందంగా పాడేరు మెయిన్‌రోడ్డు
ఎట్టకేలకు రూ.కోటి వ్యయంతో మెరుగులు
పాడేరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు జిల్లా పాడేరు మెయిన్‌రోడ్డు అందంగా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై కనీసం దృష్టి సారించని సంగతి తెలిసిందే. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం మెయిన్‌రోడ్డు విస్తరణకు మంజూరు చేసిన రూ.43 కోట్లను వెనక్కి తీసుకుంది. కాగా రోడ్ల గుంతలు పూడ్చాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు స్థానిక మెయిన్‌రోడ్డుకు మోక్షం కలిగింది. దీంతో విశాఖపట్నం నుంచి పాడేరుకు వచ్చే మెయిన్‌రోడ్డు, అంబేడ్కర్ సెంటర్ నుంచి తలారిసింగిలోని ఐటీడీఏ పెట్రోల్ బంక్ వరకు మెయిన్‌రోడ్డుకు రూ. కోటి వ్యయంతో మెరుగులుదిద్దారు. ప్రస్తుతం స్థానిక మెయిన్ రోడ్డు జీబ్రా, రేడియం లైన్లతో ఎంతో సుందరంగా దర్శనమిస్తున్నది.