Share News

ట్రాక్టర్‌ అదుపు తప్పి డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:23 PM

మండలంలో నడింపాలెం సమీప వంతెన వద్ద ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పడంతో డ్రైవర్‌ మృతి చెందాడు.

ట్రాక్టర్‌ అదుపు తప్పి డ్రైవర్‌ మృతి
మృతుడు పెద్దబ్బాయి (ఫైల్‌ ఫొటో)

కొయ్యూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలో నడింపాలెం సమీప వంతెన వద్ద ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. దీనికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బట్టపనుకుల శివారు గన్నర్లపాలేనికి చెందిన డ్రైవర్‌ చెదల పెద్దబ్బాయి(40) బుధవారం సాయంత్రం నడింపాలెం సమీప కొండవాగు ప్రవాహం నుంచి ట్రాక్టర్‌లో ఇసుక లోడుతో బయలుదేరాడు. వంతెన వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి ఇంజన్‌ పైకి లేచిపోయింది. ఇంజన్‌కు, తొట్టెకు మధ్య లింక్‌గా పెట్టిన రాడ్డు విరిగిపోవడంతో వాటి మధ్యలో ఇరుక్కుపోయి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు పెద్దబ్బాయికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:23 PM