రాజరాజేశ్వరి మూలవిరాట్‌కు తాకిన సూర్యకిరణాలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:19 PM
The rays of the sun touched the roots of Rajarajeshwari ViratThe rays of the sun touched the roots of Rajarajeshwari Virat

పాడేరురూరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పాడేరులోని అతిపురాతన శైవక్షేత్రం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి మూలవిరాట్‌కు శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. దీంతో అధిక భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అమ్మవారితోపాటు నీలకంఠేశ్వరస్వామి మూలవిరాట్‌కు కూడా ఏడాదిలో ఏదో ఒక ముఖ్య పర్వదినాలలో సూర్యకిరణాలు తాకుతుంటాయని ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీరామం పంతులు, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు తెలిపారు.