గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:25 PM
స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం
అనకాపల్లి టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించే గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజులుగా ఆర్డీవో షేక్ ఆయీషా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఢిల్లీ ఎర్రకోటను తలపించే విధంగా భారీ సెట్ ఏర్పాటు చేశారు. వివిధ శాఖల నైపుణ్యతను తెలిపేందుకు స్టాల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వేడుకలు తిలకించడానికి వచ్చే ప్రజలు, విద్యార్థులు ఎండబారిన పడకుండా ఉండేందుకు గ్యాలరీలపై షామియానాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో ప్రారంభమయ్యే గణతంత్ర వేడుకలకు అన్నిశాఖల అధికారులు రానున్నారు. పోలీసులు పరేడ్ నిర్వహించేందుకు శనివారం రిహార్సల్స్ చేశారు.