Share News

కానరాని పర్యాటకుల సందడి

ABN , Publish Date - Mar 02 , 2025 | 10:58 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించలేదు. వాతావరణంలో మార్పులతో ఏజెన్సీలో పచ్చదనం, పొగమంచు కనుమరుగు కావడంతో పాటు పర్యాటక సీజన్‌ సైతం ముగియడంతో క్రమంగా సందర్శకుల రాక తగ్గింది.

కానరాని పర్యాటకుల సందడి
వెలవెలబోతున్న పద్మాపురం గార్డెన్‌

వాతావరణంలో మార్పులు, పర్యాటక సీజన్‌ ముగియడమే కారణం

పాడేరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించలేదు. వాతావరణంలో మార్పులతో ఏజెన్సీలో పచ్చదనం, పొగమంచు కనుమరుగు కావడంతో పాటు పర్యాటక సీజన్‌ సైతం ముగియడంతో క్రమంగా సందర్శకుల రాక తగ్గింది. ఫలితంగా ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను ఆదివారం పర్యాటకులు సందడి లేకుండా పోయింది. మళ్లీ విద్యార్థుల వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఒక మోస్తరుగా పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 10:58 PM