Share News

Visakha-TCS Data Center: విశాఖపట్నంలో రూ.లక్ష కోట్లతో టీసీఎస్‌ డేటా సెంటర్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 08:09 AM

విశాఖను ఐటీ హబ్ గా చేసేందుకు విశేష కృషి కనబరుస్తున్నారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్‌తో ప్రపంచ ఖ్యాతి మూటగట్టుకుంటున్న వైజాగ్.. ఇప్పుడు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో టీసీఎస్‌ డేటా సెంటర్ కు..

Visakha-TCS Data Center: విశాఖపట్నంలో రూ.లక్ష కోట్లతో టీసీఎస్‌ డేటా సెంటర్‌
Visakha-TCS Data Center

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. అమరావతిని అత్యున్నత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే, అదే సమయంలో సాగర నగరం విశాఖను ఐటీ హబ్ గా నిలబెట్టేందుకు విశేష కృషి కనబరుస్తున్నారు.


గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖపట్నం పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతుండగా, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆసక్తి చూపించడం మరో అద్భుతమే అని చెప్పాలి. మరోవైపు, విశాఖలో టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


టీసీఎస్‌ సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఇటీవల సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్‌ ప్రతిపాదనపై చర్చించినట్టు సమాచారం. దీంతో రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా విశాఖపట్నంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ. 2 లక్షల 60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగానే కాదు, అంతకు పదిరెట్లకు పైగా పరోక్షంగా ప్రజలకు ఉపాధి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో విశాఖ అనతికాలంలోనే అంతర్జాతీయ నగరంగా మారిపోబోతోందన్న మాట.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 08:15 AM