మోదకొండమ్మను దర్శించుకున్న తమిళనాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:12 PM
పాడేరు మోదకొండమ్మను తమిళనాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాల్ దంపతులతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తమర్భ బాబూరావు నాయుడు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు.

పాడేరురూరల్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మను తమిళనాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాల్ దంపతులతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తమర్భ బాబూరావు నాయుడు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గోపాల్, బాబూరావు నాయుడు దంపతులకు ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శాస్త్రి వేదమంత్రాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఇరు కుటుంబాలను సన్మానించి, అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, రొబ్బా నాగభూషణ్‌రాజు, పలాసి కృష్ణారావు, తమర్భ విశ్వేశ్వరరావు నాయుడు, కిల్లు రామూర్తి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.