సిరులు కురిపించే స్ట్రాబెర్రీ
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:57 PM
స్ట్రాబెర్రీ సాగు సిరులు కురిపిస్తుండడంతో మండల కేంద్రంలోని బొడ్డచెట్టు కాలనీకి చెందిన గిరిజనుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు తెలిపాడు.

తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం
50 సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకుని మంచి ఫలితాలు సాధిస్తున్న గిరిజనుడు
అనంతగిరి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): స్ట్రాబెర్రీ సాగు సిరులు కురిపిస్తుండడంతో మండల కేంద్రంలోని బొడ్డచెట్టు కాలనీకి చెందిన గిరిజనుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు తెలిపాడు.
మండల కేంద్రంలోని బొడ్డచెట్టు కాలనీకి చెందిన జన్ని గంగరాజు ఐటీడీఏ క్వార్టర్స్ దిగువన 50 సెంట్ల స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. 2024 ఆగస్టు నెలలో రూ.30 వేల పెట్టుబడితో స్ట్రాబెర్రీ సాగు మొదలు పెట్టాడు. ఇంటర్‌డాన్, మబీల రకాల స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుతున్నాడు. నీరు పుష్కలంగా అందితే 45 నుంచి 60 రోజుల్లో ఫ్రూట్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఫ్రూట్ అందుబాటులోకి రావడంతో అరకు-విశాఖ ప్రధాన రహదారిలో స్టాల్ ఏర్పాటు చేసి స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తున్నాడు. దీని వల్ల రోజుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుండడంతో పండ్లు రుచిగా ఉన్నాయని పర్యాటకులు, స్థానికులు చెబుతున్నారు. తనకు అధికారులు సహకారం అందిస్తే మరిన్ని ఎకరాల్లో ఈ సాగు చేపడతానని ఆయన చెప్పారు.