మార్చి 1 నుంచి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:03 AM
ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖ-షాలిమార్ మధ్య ఒరిజినేటింగ్ ప్రత్యేక రైళ్లతోపాటు దువ్వాడ మీదుగా భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, సంబల్‌పూర్-ఈరోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖ-షాలిమార్ మధ్య ఒరిజినేటింగ్ ప్రత్యేక రైళ్లతోపాటు దువ్వాడ మీదుగా భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, సంబల్‌పూర్-ఈరోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
భువనేశ్వర్-యశ్వంత్‌పూర్-భువనేశ్వర్
02811 నంబరు గల రైలు మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ప్రతి శనివారం రాత్రి 7.15 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1.53 గంటలకు దువ్వాడ, అదేరోజు అర్ధరాత్రి 12.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02812 నంబరు గల రైలు మార్చి 3 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి సోమవారం ఉదయం 4.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు దువ్వాడ, మధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. ఖుర్దారోడ్డు, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసారావుపేట, మార్కాపూర్ రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
విశాఖ-షాలిమార్-విశాఖ
08508 నంబరు గల రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు వేకువన 3 గంటలకు షాలిమార్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08507 నంబరు గల రైలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమార్‌లో బయలుదేరి అదేరోజు రాత్రి 8.50 గంటలకు విశాఖ చేరుతుంది. సింహాచలం, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, బలుగాన్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, జైపూర్-కేంఝహార్ రోడ్డు, బద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచ్చి మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
సంబల్‌పూర్-ఈరోడ్-సంబల్‌పూర్
08311 నంబరు గల రైలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం ఉదయం 11.35 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 9.30 గంటలకు దువ్వాడ, గురువారం రాత్రి 8.30 గంటలకు ఈరోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08312 నంబరు గల రైలు మార్చి 14 నుంచి మే 2 వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఈరోడ్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ, రాత్రి 11.15 గంటలకు సంబల్‌పూర్ చేరుతుంది. బరగఢ్, బలంగీర్, టిట్లాగర్, కెసెంగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.