పిఠాపురం అభివృద్ధికి సింహాద్రి ఎన్టీపీసీ సాయం
ABN , Publish Date - Mar 04 , 2025 | 11:51 PM
సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలో మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి రూ.2.85 కోట్లు కేటాయించారు.
రూ.2.85 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు మంజూరు
పరవాడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక సింహాద్రి ఎన్‌టీపీసీ అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలో మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి రూ.2.85 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించి ఎన్టీపీసీ హెచ్‌వోపీ సమీర్‌శర్మ, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఎంవోఏ చేసుకున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలను కాకినాడ చీఫ్ ప్లానింగ్ అధికారికి మంగళవారం ఇక్కడ అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి అధికారులు బీబీ పాత్ర, కె.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.