బొర్రా గుహల్లో షూటింగ్ సందడి
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:30 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల్లో ఆదివారం షూటింగ్ సందడి నెలకొంది. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా షూటింగ్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు ఇక్కడ జరగనుంది.

అనంతగిరి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల్లో ఆదివారం షూటింగ్ సందడి నెలకొంది. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా షూటింగ్ ఆది, సోమవారం రెండు రోజుల పాటు ఇక్కడ జరగనుంది. ఈ నేపథ్యంలో బొర్రా గుహల లోపల గుడి, బంగారం నిధికి సంబంధించిన పలు సన్నివేశాల కోసం సెట్ వేశారు. షూటింగ్ నేపథ్యంలో పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు షూటింగ్ జరపనున్నారు. హీరో విజయ్ దేవరకొండపై సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలిసింది. బయట వ్యక్తులు లోపలకు వెళ్లకుండా చిత్ర బృందం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడమే కాకుండా గుహలను వారి ఆధీనంలోకి తీసుకున్నారు.