వణికిస్తున్న చలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:37 PM
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. వాతావరణంలోని మార్పులతో గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి.

జి.మాడుగులలో 9.2 డిగ్రీలు నమోదు
దట్టంగా పొగమంచు
పాడేరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. వాతావరణంలోని మార్పులతో గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. మంగళవారం ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో జి.మాడుగులలో 9.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుటులో 10.1, డుంబ్రిగుడలో 11.0, అనంతగిరి, జీకేవీధిలో 11.ఽ4, పాడేరులో 11.5, అరకులోయలో 11.6, హుకుంపేట, చింతపల్లిలో 12.0, పెదబయలులో 12.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. తాజా వాతావరణంతో మన్యంలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.