Share News

వణుకుతున్న మన్యం

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:43 PM

మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో మన్యం వాసులు వణుకుతున్నారు.

వణుకుతున్న మన్యం
పాడేరు- అరకులోయ మెయిన్‌రోడ్డులో గురువారం పొగమంచు

జి.మాడుగులలో 6.4 డిగ్రీలు నమోదు

పాడేరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో మన్యం వాసులు వణుకుతున్నారు. గురువారం జి.మాడుగులలో 6.4 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. డుంబ్రిగడలో 8.2, అరకులోయలో 8.4, చింతపల్లిలో 8.6, జీకేవీధిలో 8.7, ముంచంగిపుట్టులో 9.3, పాడేరులో 9.4, హుకుంపేటలో 9.8, పెదబయలులో 10.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.

Updated Date - Jan 09 , 2025 | 11:43 PM