Share News

సమస్యల పరిష్కారానికే ‘ప్రజాదర్బార్‌’

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:15 PM

ప్రజాదర్బార్‌లో స్వీకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికే ‘ప్రజాదర్బార్‌’
పాడేరు క్యాంప్‌ కార్యాలయంలో స్వీకరించిన వినతులను పరిశీలిస్తున్న జీసీసీ చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌

పాడేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌లో స్వీకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్‌కు 73 వినతులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు హౌసింగ్‌ బిల్లులు ఇప్పించాలని, సాగు భూములకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేయాలని, పలు గ్రామాలకు తాగునీటి సదుపాయం, రోడ్లు, డ్రైనేజీలు, సీసీ ర్యాంప్‌లు నిర్మించాలని వినతిపత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన జీసీసీ చైర్మన్‌.. సంబంఽధిత అధికారులు. ఇంజనీర్లతో ఫోన్‌లో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణ, సాగర సుబ్బారావు, పి.శశిభూషణ్‌, టి.సత్యనారాయణ, మన్మథరావు, త్రినాఽథ్‌, సూర్యకాంతం, మహేశ్వరి, కామేశ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:15 PM