కీచక పీఈటీపై పోక్సో కేసు
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:08 AM
గొలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా పవర్తించిన కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) కుందూరు నూకరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు.

నర్సీపట్నంలో మేజిస్ర్టేట్ ఎదుట హాజరు
14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు
కృష్ణాదేవిపే, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం చోద్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా పవర్తించిన కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) కుందూరు నూకరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయస్థాయి ఆటల పోటీలకు కొంతమంది బాలబాలికలు హాజరయ్యారు. వీరి వెంట వెళ్లిన పీఈటీ నూకరాజు.. బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో విద్యా శాఖ అధికారులు స్పందించి పాఠశాలలో విచారణ జరిపారు. పీఈటీపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలడంతో అతనిని విధుల నుంచి తొలగించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నూకరాజును ఆదివారం నర్సీపట్నంలో అడిషినల్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ర్టేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజులపాటు రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.