Share News

అరకులోయలో పాస్‌పోర్టు ఆఫీస్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 09:59 PM

అరకులోయలో పాస్‌పోర్టు కార్యాలయం త్వరలో ప్రారంభం కానుంది. స్థానిక సబ్‌పోస్టాఫీసు ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

అరకులోయలో పాస్‌పోర్టు ఆఫీస్‌

నెలాఖరు నాటికి అందుబాటులోకి..

స్థానిక సబ్‌పోస్టాఫీస్‌ ఆవరణలో ఏర్పాటు

అరకులోయ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో పాస్‌పోర్టు కార్యాలయం త్వరలో ప్రారంభం కానుంది. స్థానిక సబ్‌పోస్టాఫీసు ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెలాఖరుకు పాస్‌పోర్టు ఆఫీస్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే వినియోగదారులు పాస్‌పోర్టు కోసం స్లాట్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లో సుమారు 9 మంది పాస్‌పోర్టుకు స్లాట్‌బుక్‌ చేసుకోవడం గమనార్హం. పాస్‌పోర్టు ఆఫీస్‌ అందుబాటులోకి వస్తే రోజుకు 50 స్లాట్స్‌ బుక్‌ చేసుకునే అవకాశం కలగనుందని పోస్ట్‌ల్‌ సిబ్బంది తెలిపారు. గతంలో పాస్‌పోర్టు కోసం విశాఖపట్నం వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి వచ్చేది. ఇకపై అరకులోయలోనే పాస్‌పోర్టు పొందవచ్చును. పాస్‌పోర్టు ఆఫీస్‌ అందుబాటులోకి వస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - Jan 17 , 2025 | 09:59 PM