పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ4 సర్వే
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:47 AM
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పీ4 సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ పీ4 సర్వేపై సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పీ4 సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ పీ4 సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న 20 శాతం మందిని గుర్తించి పేదరికాన్ని దూరం చేయడం లక్ష్యమని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఈ నెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఇంటింటా సర్వే జరపాలని సూచించారు. ఈ సర్వే కారణంగా ప్రభుత్వ పథకాల అమలుపై ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. సర్వేలో పేర్కొన్న 27 ప్రశ్నలకు సమాధానాలను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో సీపీఓ రామారావు, వార్డు/ గ్రామ సచివాలయాల ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.