కొండగెడ్డను సర్వే చేసిన అధికారులు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:49 AM
మండలంలోని పి.ఎల్.పురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్లు 111, 112లలో ఉన్న కొండగెడ్డను గురువారం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సర్వే నిర్వహించారు. ‘కొండగెడ్డ కాలువ కబ్జా’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. కొండగెడ్డను ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతాన్ని తహీసల్దారు జి.సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల శాఖ ఏఈఈ జి.శ్రీరామ్మూర్తితో కలిసి సందర్శించారు.

రోడ్డు పనులు నిలిపి వేయాలని ఆక్రమణదారులకు నోటీసులు
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
పాయకరావుపేట రూరల్, మార్చి 6 (ఆంధ్ర.జ్యోతి): మండలంలోని పి.ఎల్.పురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్లు 111, 112లలో ఉన్న కొండగెడ్డను గురువారం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సర్వే నిర్వహించారు. ‘కొండగెడ్డ కాలువ కబ్జా’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. కొండగెడ్డను ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతాన్ని తహీసల్దారు జి.సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల శాఖ ఏఈఈ జి.శ్రీరామ్మూర్తితో కలిసి సందర్శించారు. అనంతరం సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించారు. కొండగెడ్డ గెడ్డను ఆక్రమించి చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. అనంతరం అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఆర్.త్రినాథరావు, సర్వే విభాగం డీఐ బంగారుదేవి, మండల సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.