Share News

వమ్మవరంలో నీతి ఆయోగ్‌ సర్వే బృందం పర్యటన

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:43 AM

మండలంలోని వమ్మవరం గ్రామంలో నీతి ఆయోగ్‌ రీసెర్చ్‌ సర్వే బృందం శనివారం పర్యటించింది. ఫీల్డ్‌ మేనేజర్‌ వికాస్‌ మల్కర్‌ ఆధ్వర్యంలో ఐదుగురు బృంద సభ్యులు గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగుల పెన్షన్‌లు, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన, జాతీయ ఉపాధి హామీ వంటి పథకాలపై ఆరా తీశారు.

వమ్మవరంలో నీతి ఆయోగ్‌ సర్వే బృందం పర్యటన
వమ్మవరంలో సర్వే చేస్తున్న నీతి ఆయోగ్‌ సర్వే బృందం

ఎస్‌.రాయవరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వమ్మవరం గ్రామంలో నీతి ఆయోగ్‌ రీసెర్చ్‌ సర్వే బృందం శనివారం పర్యటించింది. ఫీల్డ్‌ మేనేజర్‌ వికాస్‌ మల్కర్‌ ఆధ్వర్యంలో ఐదుగురు బృంద సభ్యులు గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగుల పెన్షన్‌లు, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన, జాతీయ ఉపాధి హామీ వంటి పథకాలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు చెప్పిన పలు విషయాలను నీతి ఆయోగ్‌ రీసెర్చ్‌ సర్వే బృందం సభ్యులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సత్యనారాయణ, సర్వే టీం సూపర్‌ వైజర్‌ సంధ్యారాణి, సభ్యులు భానుచందర్‌, లోకేశ్‌, లక్ష్మి, జి సంధ్య, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో ఎరకయ్య, వెలుగు ఏపీఎం శివప్రసాద్‌, హౌసింగ్‌ ఏఈ యోగేంద్ర, సర్పంచ్‌ పాలపర్తి పాపారావు, ఎంపీటీసీ బాలం సూరిబాబు, టీడీపీ నేత సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 12:43 AM