Share News

ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:38 PM

సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్పీ)గా నవజ్యోతి మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా బాధ్యతల స్వీకరణ
ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నవజ్యోతి మిశ్రా

గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి

చింతపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సబ్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఎస్పీ)గా నవజ్యోతి మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇక్కడ తొలి పోస్టింగ్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతంలో మావోయిస్టులు, గంజాయి ప్రధాన సమస్యలన్నారు. ఈ ప్రాంతంపై అవగాహన పెంచుకుని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానంగా గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Jan 16 , 2025 | 10:38 PM