Share News

ఏయూకు రీసెర్చ్‌ ప్రాజెక్టు

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:43 AM

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరి శోధనలను పెంచడంపై కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఏయూకు రీసెర్చ్‌ ప్రాజెక్టు

రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో భాగంగా మంజూరు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ వంద లోపు ఉన్న వర్సిటీలకు మాత్రమే అవకాశం

రూ.10 కోట్లు కేటాయింపు

సముద్ర గర్భంలోని వస్తువులు, జీవరాశులు, పరికరాలపై పరిశోధన

విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరి శోధనలను పెంచడంపై కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐ ఆర్‌ఎఫ్‌) టాప్‌-100లో నిలిచిన విశ్వవిద్యా లయాలకు భారీగా నిధులు మంజూరుచేసింది. టాప్‌-20లో నిలిచిన విశ్వవిద్యాలయాలను ఒక్కో హబ్‌ కేంద్రంగా ఎంపిక చేసి, 21 నుంచి వంద వరకూ ర్యాంకు సాధించిన యూని వర్సిటీలను వాటి పరిధిలో చేర్చింది. ఒక్కో హబ్‌కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేసింది. హబ్‌ పరిధిలోని యూనివర్సిటీలను స్పోక్‌ సెంటర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఏయూ 41వ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏయూను బిట్స్‌ పిలానీ హబ్‌కు కేటాయించారు. బిట్స్‌కు కేటాయించిన వంద కోట్లలో స్పోక్‌ యూనివర్సిటీలకు పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం రూ.10 కోట్లు చొప్పున కేటాయించనుంది. ఈ మేరకు ఏయూకు రూ.10 కోట్లు బిట్స్‌ మంజూరుచేసింది. ఏయూ సముద్ర గర్భంలోని వస్తువులు, జీవ రాశులు, ఇతర అంశాలకు సంబంధించి పరిశోధన సాగించనున్నది. ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని ఏయూ వీసీ ప్రొఫె సర్‌ జి.శశిభూషణరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అందించే నిధులను పరిశోధన సాగించేందుకు అవసరమైన పరి కరాలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుతోపాటు పరిశోధకులకు ఉపకార వేతనాలు చెల్లిం చేందుకు వినియోగించనున్నారు. ఇంజ నీరింగ్‌తోపాటు సైన్స్‌ కాలేజీ పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. గతంలో ఈ నిఽధులను డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నేరుగా యూనివర్సిటీలకు అందిం చేది. ఈ ఏడాది హబ్స్‌గా ఏర్పాటుచేసి వాటికి కేటాయిస్తోంది. పరిశోధనకు సంబంధించి యూనివర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని సీనియర్‌ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:04 AM