కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:21 AM
అనకాపల్లి పట్ణణంతోపాటు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో వర్షం మాదిరిగా మంచు కురిసింది. ఏజెన్సీని తలపించే రీతిలో మైదాన ప్రాంతాన్ని పొగమంచు ముంచేసింది. కొన్నిచోట్ల 30 మీటర్లకు పైబడి దూరంలో వున్నవి ఏవీ కనిపించనంతగా పరిస్థితి వుంది.

ఏజెన్సీని తలపించిన మైదాన పాంతం
ఉదయం 9 గంటల వరకు వీడని మంచుతెరలు
అనకాపల్లి టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్ణణంతోపాటు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. శివారు ప్రాంతాల్లో వర్షం మాదిరిగా మంచు కురిసింది. ఏజెన్సీని తలపించే రీతిలో మైదాన ప్రాంతాన్ని పొగమంచు ముంచేసింది. కొన్నిచోట్ల 30 మీటర్లకు పైబడి దూరంలో వున్నవి ఏవీ కనిపించనంతగా పరిస్థితి వుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీనికితోడు చలి తీవ్రత బాగా పెరిగింది. వివిధ పనులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లాల్సిన వారు చలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలకు హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించాల్సి వచ్చింది. అనకాపల్లి స్టేషన్‌కు పలు రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ప్రస్తుత శీతాకాలంలో ఇంత భారీగా మంచుకురవడం ఇదే ప్రథమమని పలువురు అంటున్నారు.