Share News

రోడ్డుపక్కన మంత్రి సత్యకుమార్‌ టిఫిన్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:38 AM

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చాలా సాదాసీదాగా ఉంటారు.

రోడ్డుపక్కన మంత్రి సత్యకుమార్‌ టిఫిన్‌

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చాలా సాదాసీదాగా ఉంటారు. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండేందుకు యత్నిస్తారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ విచ్చేసిన ఆయన సోమవారం ఉదయం గురుద్వార జంక్షన్‌ సమీపంలో రోడ్డు పక్కనున్న బండి వద్ద సాధారణ పౌరులతో కలిసి టిఫిన్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురితో సరదాగా మాట్లాడారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:38 AM