నేడు మంత్రి నారా లోకేశ్ రాక
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:59 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి నగరానికి రానున్నారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి నగరానికి రానున్నారు. ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గల సన్‌రే విలేజ్ రిసార్ట్స్‌లో వెళతారు. అక్కడ జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం 11.30 గంటలకు బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మధ్యాహ్నం 12.55 గంటలకు హైదరాబాద్ వెళతారు.
------------------------------------------------------------------------------------
వాట్సాప్ ద్వారా సింహాచలం దేవస్థానం సేవలు
సింహాచలం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో అధికారులు వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టారు. భక్తులు ఆర్జిత సేవల టికెట్ల కొనుగోలు, విరాళాల సమర్పణ వంటివి వాట్సాప్ (9552300009) ద్వారా చేసుకోవచ్చునని కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. పైన పేర్కొన్న నంబర్‌కు ఆంగ్లంలో హాయ్ అని పంపితే పలు సేవలు అందుబాటులోకి వస్తాయి. అందులో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసుకుని దర్శనం, సేవలు, డొనేషన్లు...ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనకు కావలసిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. నిర్దేశించిన రుసుమును చెల్లించి తగు డిజిటల్ రశీదును పొందాలి.