అన్న కూతురునే తల్లిని చేసిన మృగాడి అరెస్టు
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:39 AM
వరసకు అన్నయ్య కూతురు అయిన యువతిని తల్లిని చేసిన మృగాడిని ఎట్టకేలకు శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి వెస్ట్ ఏసీపీ ఫృథ్వీరాజ్ ఆదేశాల మేరకు సీఐ కేవీ సతీశ్‌కమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెందుర్తి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): వరసకు అన్నయ్య కూతురు అయిన యువతిని తల్లిని చేసిన మృగాడిని ఎట్టకేలకు శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి వెస్ట్ ఏసీపీ ఫృథ్వీరాజ్ ఆదేశాల మేరకు సీఐ కేవీ సతీశ్‌కమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి గోశాల సమీపంలోని ప్రహ్లాదపురానికి చెందిన ఓ బాలికకు తల్లి చిన్నతనంలోనే మృతి చెందడంతో తండ్రి వేరే వివాహం చేసుకోవడంతో ఆమె అమ్మమ్మ సంరక్షణలో ఉంది. కాగా 2012లో బాలిక అమ్మమ్మ మృతి చెందడంతో పిన్ని, చిన్నాన్నల వద్ద ఉండేది. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత బాలికకు యుక్తవయసు వచ్చాక ఆమె ఆస్తిని దక్కించుకోవాలని చిన్నాన్న కుట్రపన్నాడు. మాయమాటలు చెప్పి ఆమె వద్దనున్న రూ.13 లక్షలు తీసుకుని చినముషిడివాడలో స్థలం కొనుగోలు చేశాడని సీఐ తెలిపారు. ఆ స్థలం వివాదాస్పదం కావడంతో చిన్నాన్నను ఆమె నిలదీసింది. దీంతో 2013లో ఇంట్లో ఆమె పిన్ని లేని సమయంలో బలవంతంగా అనుభవించడంతో పాటు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 2015లో తమ దగ్గరి బంధువైన యువకుడితో ఆ యువతినిచ్చి వివాహం జరిపాడు. భర్తతో శ్రీకాకుళం కాపురానికి వెళ్లిన ఐదు నెలలనే వారి మఽధ్య విభేదాలు రావడంతో ఆమెను తిరిగి ప్రహ్లాదపురానికి తీసుకువచ్చాడు. అనంతరం ఆమెపై చిన్నాన్న లైగింక దాడికి పాల్పడడంతో గర్భవతి అయింది. ఈ విషయం బయటకు పొక్కితే తమ పరువు పోతుందని ఆమెను 2016లో మలేషియా పంపాడు. డెలివరీ సమయానికి విజయవాడ తీసుకువచ్చి ఓ ఆస్పత్రిలో చేర్చాడు. ఆస్పత్రి రిజిస్టర్‌లో బిడ్డ తండ్రిగా చిన్నాన్నే సంతకం చేశాడని సీఐ పేర్కొన్నారు. కాగా తనను స్థలం పేరిట మోసం చేసి రూ.13 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారాన్ని కాజేయడంతో పాటు తల్లిని చేశాడంటూ చిన్నాన్నపై ఆమె 2023లో పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అరెస్టు చేయకుండా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా ఆ అప్పీల్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో నిందితున్ని విజయవాడలో అరెస్టు చేసినట్టు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. వెస్ట్ ఏసీపీ పృథ్వీరాజ్ తగిన ఆధారాలతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.