Share News

ఇంటికి పోదాం చలో... చలో...

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:44 PM

విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటి బాట పడుతున్నారు. ఈ ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

ఇంటికి పోదాం చలో... చలో...
పాడేరు గురుకులం నుంచి ఇళ్లకు వెళుతున్న బాలికలు

సంక్రాంతి సెలవులకు విద్యార్థుల ఇంటి బాట

పాడేరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటి బాట పడుతున్నారు. ఈ ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గురువారం సాయంత్రం పాఠశాలలు ముగిసిన వెంటనే తమ పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళ్లిపోతున్న దృశ్యాలే కనిపించాయి. పిల్లల లగేజీలు పట్టుకుని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు, పాత బస్టాండ్‌కు వెళుతుండడంతో గురువారం సాయంత్రం పాడేరులో సందడి నెలకొంది.

Updated Date - Jan 09 , 2025 | 11:44 PM