Share News

ఏయూ దూర విద్యలో లేటరల్‌ ఎంట్రీ దుమారం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:41 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూర విద్యా కేంద్రంలో లేటరల్‌ ఎంట్రీపై దుమారం రేగుతోంది.

ఏయూ దూర విద్యలో లేటరల్‌ ఎంట్రీ దుమారం

  • నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలపై విమర్శలు

  • నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ప్రక్రియ ప్రారంభం

  • కొన్ని కాలేజీల నుంచి లబ్ధి చేకూరడమే కారణం

  • విద్యార్థులకు మేలు చేసేందుకే: దూర విద్య డైరెక్టర్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూర విద్యా కేంద్రంలో లేటరల్‌ ఎంట్రీపై దుమారం రేగుతోంది. ఈ విధానంలో చేపట్టే ప్రవేశాలతో ప్రైవేటు కాలేజీలు ఇష్టారా జ్యంగా వ్యవహరించడంతోపాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ విధానాన్ని రద్దుచేశారంటున్నారు. తాజాగా లేటరల్‌ ఎంట్రీ విఽధానంలో ప్రవేశాలకు దూరవిద్యా కేంద్రం అధికా రులు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమయింది. లేట రల్‌ ఎంట్రీ ప్రారంభించాలని భావిస్తే ముందుగా నోటిఫికే షన్‌ ఇవ్వాలి. కానీ అదేదీ లేకుండా ప్రక్రియ ప్రారంభించడం వెనుక కొందరు అధికారుల అధికారుల అత్యుత్సాహం, ప్రైవేటు కాలేజీల నుంచి లబ్ధి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనివార్య కారణాల వల్ల డిగ్రీ పూర్తిచేయని విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీ విధానంలో కోర్సు పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షలు రాయకపోడం, కొన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ కావడంతో సర్టిఫికెట్‌ పొందలేని పరిస్థితి. వారికి ఈ విధానంలో ప్రవే శాలు కల్పించడం ద్వారా మిగిలిన సబ్జెక్టులు పూర్తిచేసే వీలు కల్పిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని ప్రైవేటు కాలే జీలు పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛనిస్తాయని, కాపీయింగ్‌ ను ప్రోత్సహించి, వసూళ్లకు పాల్పడతాయని చెబుతు న్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కాలేజీలు ఒత్తిడి చేసి మరీ లేటరల్‌ ఎంట్రీ విధానాన్ని తీసుకువచ్చేలా అధికారులను ప్రసన్నం చేసుకున్నట్టు చెబుతున్నారు.

స్పెషల్‌డ్రైవ్‌ ఉన్నా...

అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తిచేయలేని విద్యార్థుల కోసం ఇప్పటికే ఏయూ అధికారులు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహి స్తున్నారు. తగిన ఫీజు చెల్లించి డిగ్రీ పూర్తిచేసే అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ దూర విద్య అధికారులు లేటరల్‌ ఎంట్రీకి అవకాశం కల్పించడం అనేక అనుమానా లకు తావిస్తోందంటున్నారు. అంతేకాదు లేటరల్‌ ఎంట్రీలో అడ్మిషన్‌ పొందే విద్యార్థులు డిస్టెన్స్‌లో కోర్సు పూర్తిచేసి నట్టు సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. అదే స్పెషల్‌డ్రైవ్‌లో అయితే రెగ్యులర్‌ సర్టిఫికెట్‌ వస్తుంది. అయినా ఈ విధానానికే మొగ్గు చూపడం వెనుక కారణాలేమిటనేది అధకారులు బయటపెట్టడం లేదంటున్నారు.

నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే..

సాధారణంగా దూరవిద్య అడ్మిషన్లకు ముందుగా నోటిఫికేషన్‌ ఇస్తారు. లేటరల్‌ ఎంట్రీలకు కూడా ఇది అవ సరం. కానీ ప్రస్తుతం నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనిపై దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌మోహన్‌ను వివ రణ కోరగా విద్యార్థులకు మేలు చేకూరుతుందన్న ఉద్దేశం తోనే లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఏయూ పరిధిలోని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అనేక కారణాలతో వందలాది మంది డిగ్రీలను మధ్యలోనే వదిలేశారని, వారికి మేలు చేయడమే ధ్యేయమని, ఉన్నతాధికారుల అనుమతితోనే ప్రక్రియను ప్రారంభించామన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:41 AM