రేపటి నుంచి భూముల విలువల సవరణ
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:45 AM
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు గురువారం తెలిపారు.

జిల్లాలో 3 నుంచి 15 శాతం పెంపు
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు గురువారం తెలిపారు. అన్నింటినీ పరిశీలించి తుది విలువలు రూపొందించామని, అవి శనివారం నుంచి అమలులోకి వస్తాయన్నారు. జిల్లాలో భూముల ధరలు మూడు శాతం నుంచి 15 శాతం వరకు పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో అసలు మార్పులే చేయలేదన్నారు. ఎక్కడైతే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నదో అక్కడే విలువలు పెంచామని చెప్పారు.