ఐవోఈ హోదా దక్కేనా?
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:52 AM
కేంద్ర ఉన్నత విద్యాశాఖ అందించే ప్రతిష్ఠాత్మకమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమి నెన్స్ (ఐవోఈ) హోదా దక్కించుకునేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఇందుకోసం తీవ్రస్థాయిలో శ్రమిస్తుంటాయి. దీనిని దక్కించుకోవడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు వీలుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ కూడా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయస్థాయిలో సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు ఐవోఈ హోదా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తింపునకు ఏయూ అధికారుల యత్నాలు
22న వర్క్‌షాప్ నిర్వహణకు ఏర్పాట్లు
హోదా దక్కితే వర్సిటీకి భారీగా నిధులు
స్వయం ప్రతిపత్తి లభించే అవకాశం
దేశంలోని ప్రముఖ వర్సిటీల సరసన చేరే వీలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ఉన్నత విద్యాశాఖ అందించే ప్రతిష్ఠాత్మకమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమి నెన్స్ (ఐవోఈ) హోదా దక్కించుకునేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు ఇందుకోసం తీవ్రస్థాయిలో శ్రమిస్తుంటాయి. దీనిని దక్కించుకోవడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేందుకు వీలుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ కూడా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు జాతీయస్థాయిలో సత్తా చాటేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు ఐవోఈ హోదా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ఐవోఈ హోదా దక్కించుకునే ప్రణాళికల్లో భాగంగా ఈనెల 22న ఏయూలో వర్క్‌షాప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ హాజరుకానున్నారు. వర్క్‌షాప్‌లో ఐవోఈ హోదా దక్కించుకునేందుకు ఫ్యాకల్టీ, పరిశోధకులు చేయాల్సిన పనులు, పరిపాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించనున్నారు. అధ్యా పకులు, సీనియర్ ప్రొఫెసర్లు, డీన్లు, పరిశోధక విద్యార్థులు ఇందులో పాల్గొనేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
హోదాతో భారీగా లబ్ధి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా లభిస్తే ఏయూకు భారీగా లబ్ధి చేకూరుతుంది. యూజీసీతోపాటు కేంద్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ఏటా వందల కోట్ల నిధులు వస్తాయి. పరిశోధన ప్రాజెక్టులు భారీ సంఖ్యలో మంజూరవుతాయి. అదే సమయంలో వర్సిటీకి స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. కోర్సులు అమలువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటుంటుంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు అందించేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వస్తాయి. దీనివల్ల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పెరుగుతాయి. ప్రపంచ స్థాయి వర్సిటీలతో కలిసి పనిచేసే వెసులుబాటు లభిస్తుం ది. కేంద్ర ప్రభుత్వమే ఈ హోదా కలిగిన ఇనిస్టిట్యూట్స్ గురించి ప్రత్యేకంగా ప్రచారం చేస్తుంది. దీనివల్ల భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఇవి ఉంటేనే...
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా దక్కడం కష్టమేమీ కాదని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణ యాలు తీసుకుంటే చాలంటున్నారు. హోదా రావాలంటే వర్సిటీకి సుదీర్ఘమైన చరిత్ర ఉండాలి. వందేళ్ల చరిత్ర ఉం డడం ఏయూకు సానుకూల అంశం. రీసెర్చ్ ప్రాజెక్టులు భారీగా ఉండాలి. వర్సిటీలో పనిచేసే ప్రతి ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉం డాలి. కన్సెల్టెన్సీ రీసెర్చ్ ప్రాజెక్టులు ఉండాలి. టీచింగ్, లెర్నింగ్ మెథడ్స్ ఫాలో కావాలి. కోర్సు ఫైల్ అనుస రించాలి. సింగిల్ ఆథర్ రీసెర్చ్ పేపర్స్ సైన్స్ సైటేషన్ ఇండెక్స్ జర్నల్స్‌లో క్యూ1, క్యూ2 స్టాండర్డ్స్‌తో పబ్లిష్ అయి ఉండాలి. పీహెచ్‌డీల్లో అధిక ప్రవేశాలతోపాటు అదేస్థాయి లో ఔట్‌కమ్ ఉండాలి. మల్టీ డిసిప్లైనరీ రీసెర్చ్‌వర్క్ జరు గుతుండాలి. వీటిలో కొన్ని అంశాల్లో వర్సిటీ వెనుకబడి ఉంది. వీటిలో మెరుగైన పనితీరు కనబరచడం ద్వారా హోదా దక్కించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.