నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:27 AM
పాడేరు డివిజన్‌లోని 16 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈవో కె.అప్పలరాము తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ విద్యార్థులు 11,317 మంది, బైపీసీ విద్యార్థులు 1,667 మంది హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

- పాడేరు డివిజన్‌లో 16 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 12,984 మంది విద్యార్థులు
- డీఐఈవో కె.అప్పలరాము
పాడేరురూరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పాడేరు డివిజన్‌లోని 16 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈవో కె.అప్పలరాము తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ విద్యార్థులు 11,317 మంది, బైపీసీ విద్యార్థులు 1,667 మంది హాజరుకానున్నారని ఆయన తెలిపారు. పాడేరు డివిజన్‌లో అరకులోయలో మూడు, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, జీకేవీధి, అప్పర సీలేరు, కొయ్యూరు మండలాల్లో ఒక్కొక్క పరీక్ష కేంద్రాలను, పాడేరు, చింతపల్లి మండలాల్లో రెండు చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.