ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:10 AM
జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షలకు 42,700 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 34,645 మంది, బైపీసీ 4,884, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 3,171 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం 167 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు.

జిల్లాలో 42,700 మంది విద్యార్థులు
167 కేంద్రాలు ఏర్పాటు
5 నుంచి ఒకేషనల్, 10 నుంచి
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నిర్వహణ
మద్దిలపాలెం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి నిర్వహించే ఈ పరీక్షలకు 42,700 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 34,645 మంది, బైపీసీ 4,884, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 3,171 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకోసం 167 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు.
జనరల్ కోర్సులు బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఉదయం 10-12, మధ్యాహ్నం 2-5 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీన నైతిక, మానవీయ విలువలు, 3వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆయా పరీక్షలకు కచ్చితంగా హాజరవ్వడమే కాకుండా ఉత్తీర్ణత కూడా సాధించాలి.
పక్కాగా ఏర్పాట్లు..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. వాటిని బోర్డు కార్యాలయంలో వీక్షించే విధంగా అనుసంధానం చేస్తున్నారు. పరీక్షల మెటీరియల్ ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుంది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్టు ఆర్‌ఐవో మురళీధర్ చెప్పారు. స్క్వాడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.