అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధరలు పెంపు
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:22 AM
గిరిజనుల నుంచి కొనుగోలు చేసే అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను గిరిజన సహకార సంస్థ పెంచినట్టు జీసీసీ స్థానిక డివిజనల్ మేనేజర్ పి.దేవరాజు చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ధరలు ఈ విధంగా వున్నాయి..
జీసీసీ డీఎం దేవరాజు
చింతపల్లి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల నుంచి కొనుగోలు చేసే అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలను గిరిజన సహకార సంస్థ పెంచినట్టు జీసీసీ స్థానిక డివిజనల్ మేనేజర్ పి.దేవరాజు చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం నుంచి అమల్లోకి వచ్చిన ధరలు ఈ విధంగా వున్నాయి.. అడవి తేనెను గరిష్ఠంగా కిలో రూ.300కు కొనుగోలు చేస్తున్నారు. కరక్కాయ కిలో రూ.20, ముషిడిపిక్కలు రూ.100, తానికాయలు రూ.18, నల్లజీడిపిక్కలు రూ.32, పిక్కతో చింతపండు రూ.36, పిక్కతీసిన చింతపండు రూ.67, ఫ్లవర్ చింతపండు రూ.90, కానుగపప్పు రూ.25, కుంకుడు కాయలు రూ.35, శీకాయ రూ.40, పెట్టెతేనె రూ.150, తేనె మైనం రూ.160, చిల్లగింజలు రూ.50, నరమామిడి చెక్క రూ.18, కొండచీపుర్లు గ్రేడ్-1 రూ.45, గ్రేడ్-2 రూ.40, గ్రేడ్-3 రూ.35, ఎండు ఉసిరి రూ.90, చింతపిక్కలు రూ.10, రెళ్లచెక్క రూ.10, విప్పపువ్వు రూ.17, కొండగోగు జిగురు గ్రేడ్-1 రూ.200, గ్రేడ్-2 రూ.150, తిప్పతీగ రూ.11, మారేడుగడ్డలు రూ.450, పాలగుండపలుకులు రూ.270, పసుపు రూ.100, రాజ్‌మా రూ.90, బొబ్బర్లు రూ.50, రాగులు రూ.35, ఎండుమిర్చి రూ.145కి కొనుగోలు చేస్తున్నామన్నారు.