హైవే నుంచి కారిడార్‌కు రోడ్డు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:53 AM
మండలంలో జాతీయ రహదారిపై కాగిత గ్రామం జంక్షన్ నుంచి విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల వరకు రూ.28 కోట్ల వ్యయంతో రహదారి నిర్మించనున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో వీవీవీ రమణ చెప్పారు.

నాలుగు కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పు
అంచనా వ్యయం రూ.28 కోట్లు
పనులు త్వరగా చేపట్టాలని ఆర్డీవో ఆదేశం
నక్కపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో జాతీయ రహదారిపై కాగిత గ్రామం జంక్షన్ నుంచి విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ భూముల వరకు రూ.28 కోట్ల వ్యయంతో రహదారి నిర్మించనున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో వీవీవీ రమణ చెప్పారు. ఈ రహదారి నిర్మాణ విషయమై మంగళవారం ఆయన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సుధాకర్, ఈఈ రమేశ్ కుమార్, డీఈ రాధాకృష్ణ, ఏఈ జ్ఞానేశ్వర్‌తో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. కారిడార్ రహదారి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆర్డీవోకు సూచించారు. మొత్తం నాలుగు కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో కారిడార్‌కు రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఆర్డీవో చెప్పారు.