లా వర్సిటీలో హైకోర్టు సీజే
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:13 AM
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఉప కులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సుమారు నాలుగు గంటలపాటు విశ్వవిద్యాలయంలో గడిపారు. కులపతి హోదాలో జనరల్ కౌన్సెల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగల పనితీరును సమీక్షించారు.

కులపతి హోదాలో జనరల్ కౌన్సెల్ సమావేశం నిర్వహించిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
విద్యార్థినుల వసతిగృహాలు ప్రారంభం
హాస్టళ్ల నిర్వహణ, మెనూ అమలుపై పలు సూచనలు
సబ్బవరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఉప కులపతి ప్రొఫెసర్ డి.సూర్యప్రకాశరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సుమారు నాలుగు గంటలపాటు విశ్వవిద్యాలయంలో గడిపారు. కులపతి హోదాలో జనరల్ కౌన్సెల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగల పనితీరును సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల కోసం కొత్తగా నిర్మించిన రెండు వసతిగృహాలను ఆయన ప్రారంభించారు. అన్ని హాస్టళ్లను పరిశీలించి, విద్యార్థుల భోజన, వసతి సదుపాయాల గురించి సమీక్ష చేశారు. వసతుల మెరుగునకు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. విద్యార్థుల మెస్ కమిటీ పనితీరును సమీక్షించారు. వసతిగృహాల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూనతంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను సీజే పరిశీలించారు. ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ విశ్వచంద్రనాథ్ మాదాసు, చీఫ్ వార్డెన్ భాగ్యలక్ష్మి వున్నారు.