94.6ు మందికి గ్యాస్ సబ్సిడీ
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:05 AM
ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి తొలివిడత సబ్సిడీని 94.6 శాతం మంది వినియోగించుకున్నారు. జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా, అందులో 3,76,924 మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకునేందుకు అర్హులుగా నిర్ధారించారు.
3,49,633 మందికి రూ.27.73 కోట్లు జమ
విశాఖపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):
ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి తొలివిడత సబ్సిడీని 94.6 శాతం మంది వినియోగించుకున్నారు. జిల్లాలో 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా, అందులో 3,76,924 మంది ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకునేందుకు అర్హులుగా నిర్ధారించారు. వీరంతా 2025 మార్చి నెలాఖరులోగా తొలివిడత సబ్సిడీ వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. బుధవారం వరకూ 3,56,881 మందికి సిలిండర్లు డెలివరీ చేయగా, వారిలో 3,47,091 మందికి సబ్సిడీ కింద రూ.27.73 కోట్లు జమ చేశారు. సిలిండర్లు డెలివరీ అయి...ఇంకా సొమ్ము అందని వారికి రెండు, మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కూటమి నేతలు...ఇచ్చిన హామీ మేరకు గత అక్టోబరు నుంచి పథకం అమలులోకి తీసుకువచ్చారు.