Share News

Free Training: స్మార్ట్ ఎనర్జీ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ!

ABN , Publish Date - Jul 17 , 2025 | 10:17 AM

Free Training: విశాఖలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పవర్ సెక్టార్ కింద జూనియర్ టెక్నిషియన్ స్మార్ట్ ఎనర్జీ మీటరు కోర్సులో మూడు నెలల ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్టు NAC అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. వారికి రూ.7,500లు స్టైఫండ్‌, కేంద్ర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందజేస్తామని చెప్పారు.

Free Training: స్మార్ట్ ఎనర్జీ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ!

పెందుర్తి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా (Visakhapatnam) పరిధి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సౌజన్యంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తం పవర్ సెక్టార్ కింద జూనియర్ టెక్నిషియన్ స్మార్ట్ ఎనర్జీ మీటరు కోర్సులో మూడు నెలల ఉచిత స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్టు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ (విశాఖ) ఎస్వీఎస్ఎస్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


రూ.7,500లు స్టైఫండ్‌...

ఈ క్రమంలో జూనియర్ టెక్నీషియన్ స్మార్ట్ ఎనర్జీ మీటరు కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 సంవత్సరాల వయోపరిమితి గల అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని ఉచితంగా స్టేషనరీతో శిక్షణ అందిస్తామ్నారు. మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని, శిక్షణ పూర్తయిన వారికి రూ.7,500లు స్టైఫండ్‌, కేంద్ర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అందజేస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి

గర్ల్‌‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..

చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..

Updated Date - Jul 17 , 2025 | 10:17 AM